Advertisement

Latest News

నాగచైతన్య-సునీల్‌ ‘చిన్నోడు-పెద్దోడు’

By Vikram - Friday, March 15, 2013







నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా శ్రీసాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘చిన్నోడు-పెద్దోడు’ అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం. మొదట ఈ చిత్రానికి ‘తడాఖా’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఫన్ వచ్చే విధంగా ఉండాలని ఈ టైటిల్ ని పరిగణనలోకి తీసుకుని నాగార్జునకి తెలియచేసినట్లు తెలుస్తోంది. నాగార్జున ఓకే చేస్తే వెంటనే ఈ టైటిల్ తో ప్రకటన వస్తుందని వినపడుతోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రంలో నాగచైతన్య, సునీల్‌ అన్నదమ్ములుగా చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన తమన్నా, సునీల్ సరసన ఆండ్రియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంతో పరిచయమైన పి.కిశోర్‌కుమార్‌ (డాలీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

Follow our blog on Twitter, become a fan on Facebook. Stay updated via RSS

0 comments for "నాగచైతన్య-సునీల్‌ ‘చిన్నోడు-పెద్దోడు’"

Leave a Reply

Advertisement