మహేష్,పూరీల ‘టపోరి’
By Vikram - Friday, March 15, 2013
మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టపోరి టైటిల్ నే పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇద్దరు అమ్మాయిలు చిత్రం బిజీలో ఉన్న పూరీ మరో ప్రక్క ఈ చిత్రానికి సంభందించిన స్క్రిప్టు పూర్తి చేసి, మహేష్ కు వినిపించారు. పూర్తి బౌండ్ స్క్రిప్టుకు ఇంప్రెస్ అయిన మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2013 చివరలో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. ఈ లోగా బండ్ల గణేష్..ఇద్దరు అమ్మాయిలతో,బాద్షా చిత్రాలు విడుదల చేస్తారు. ఇక మహేష్ బాబు, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కలయిక అంటే…ఆ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసేలా విజయం సాధించడం ఖాయం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో కొత్తగా చెప్పక్కర్లేదు.
Follow our blog on Twitter, become a fan on Facebook. Stay updated via RSS
0 comments for "మహేష్,పూరీల ‘టపోరి’"